బాలకృష్ణ, బోయపాటి టైటిల్ ఖరారు... సోషల్ మీడియాలో లీక్!

Balakrishna Boyapati New Movie Tittle Leak
  • వర్కింగ్ టైటిల్ గా 'బీబీ3'
  • 'టార్చ్ బేరర్' అనే పేరు ఖరారు
  • ఇంకా వెలువడని అధికారిక సమాచారం
నందమూరి బాలకృష్ణతో 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బోయపాటి శ్రీను నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రం, వర్కింగ్ టైటిల్ 'బీబీ 3' కాగా, ఈ సినిమాకు ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. తాజాగా, మరో పేరు టాలీవుడ్ వర్గాల్లో మారుమోగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత ఈ చిత్రానికి 'డేంజర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి.

కాగా, ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. దీనికి 'టార్చ్ బేరర్' అనే పేరును బోయపాటి ఖరారు చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ పేరు బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందిస్తేనే అధికారిక సమాచారం తెలుస్తుంది. ఇక ఇదే టైటిల్ కన్ఫార్మ్ చేస్తారా? మరో కొత్త పేరు తెరపైకి వస్తుందా? అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu
Torch Bearer
BB#

More Telugu News