ఈ ప్రశ్నకు దైవదూత సమాధానం చెపుతారా?:చిదంబరం
- కరోనా అనేది దేవుడి చర్య అని చెప్పిన నిర్మలా సీతారామన్
- ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా?
- రాష్ట్రాల ఆర్థిక భారం బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం సరికాదు
జీఎస్టీ బకాయిల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రుణాల ద్వారా పూడ్చుకోవాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించడాన్ని చిదంబరం తప్పుపట్టారు. ఆర్బీఐ విండో కింద రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే అర్థమని, ఇది కేవలం పేరు మార్పు తప్ప మరేం కాదని చెప్పారు. దీని వల్ల ఆర్థికభారం రాష్ట్రాలపైనే పడుతుందని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక భారానికి సంబంధించిన బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం సరికాదని చెప్పారు.