చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా
- చెన్నై శిబిరంలో 13కి పెరిగిన కరోనా బాధితులు
- బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ కు పాజిటివ్!
- చెన్నై జట్టు పరిస్థితి కష్టమేనంటున్న క్రికెట్ వర్గాలు
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 13కి పెరిగినట్టయింది. కొంతమంది సహాయక సిబ్బంది కూడా కరోనా బాధితుల్లో ఉన్నట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్రికెట్ వర్గాలు స్పందిస్తూ, ఒకే ఫ్రాంచైజీలో 13 కేసులు వచ్చాయంటే, అది ఇతర ఫ్రాంచైజీలను కూడా ఆందోళనకు గురిచేస్తుందని పేర్కొన్నాయి.