Corona Virus: తెలంగాణలో కరోనా అప్‌డేట్స్‌.. కొత్తగా 2,751 కేసులు

new 2751 coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,751  కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1675   మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,20,116 కి చేరింది. ఆసుపత్రుల్లో   30,008 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  89,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 808కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా432    కరోనా కేసులు నమోదయ్యాయి.  
        
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News