Prakash Raj: 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్' అంటూ తన షూటింగులో ఫొటో పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్

prakash raj look in kgf
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా షూటింగులు నిలిచిపోవడంతో సినీనటులు ఇంటి వద్దే ఉంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. దీంతో సినీనటుడు ప్రకాశ్ రాజ్ 'కేజీఎఫ్ చాఫ్ట‌ర్-2' సినిమా షూటింగులో పాల్గొన్నారు. బెంగ‌ళూరులో సినిమా సెట్స్ లో ఆయన కనపడ్డారు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
                                     
ఓ ఫొటోలో కన్నడ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్.. ప్ర‌కాశ్ రాజ్ కు సీన్ వివ‌రిస్తున్నట్లు తెలుస్తోంది. యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' రూపొందుతోంది. కన్నడలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు.
Go Back to Shorts
Prakash Raj
kgf
Tollywood

More Telugu News