తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు

3018 new  coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688
  • ఆసుపత్రుల్లో 25,685 మందికి చికిత్స
  • ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 780
తెలంగాణలో కొవిడ్-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా  3,018 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో పది మంది  కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఆసుపత్రుల్లో 25,685 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 780కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా కేసులు నమోదయ్యాయి.              
                       
Corona Virus
COVID-19
Telangana

More Telugu News