అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం
- అచ్చెన్న బెయిల్ పై నేడు విచారణ
- హైకోర్టులో ముగిసిన వాదనలు
- వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం
ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరి గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు వాదించారు. కాగా, కరోనా బారినపడిన అచ్చెన్నాయుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు రమేశ్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించడం తెలిసిందే.