మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చిరంజీవి, బాబీ సినిమా?
- 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు
- కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మెగాస్టార్
- మరో నిర్మాతను కూడా భాగస్వామ్యం చేసేలా యోచన
మరోపక్క ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మించడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకు ఈ సంస్థను బాబీ బాగా సిఫార్సు చేస్తున్నాడట. అయితే, ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు మరో నిర్మాతను కూడా భాగస్వామ్యం చేసేలా చిరంజీవి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నిర్మాతల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.