ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్ ప్రభాస్: బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రశంసలు
- ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్'
- రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న చిత్రం
- ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడన్న దర్శకుడు ఓంరౌత్
ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో ప్రభాస్ అని ఓంరౌత్ కితాబిచ్చారు. 'మోర్ దేన్ లైఫ్' సినిమాలను చేయగల హీరో అని ప్రశంసించారు. ఇదే సమయంలో 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ చెప్పారు. ఓవైపు మౌనమునిలా ఉంటూనే... గర్జించే పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపారు. ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రభాస్ శిక్షణ తీసుకోబోతున్నాడని వెల్లడించారు.