సైఫ్ అలీఖాన్ కూతురు, సుశాంత్ ప్రేమించుకున్నారు: శామ్యూల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు
- 'కేదార్ నాథ్' సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు
- సినిమా ప్రమోషన్ సమయానికి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు
- సుశాంత్ తర్వాతి సినిమా ఫ్లాప్ కావడంతో సారా బ్రేకప్ చేసుకుంది
'కేదార్ నాథ్' చిత్రంలో సుశాంత్, సారా ఇద్దరూ కలిసి నటించారని... ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారని శామ్యూల్ చెప్పాడు. ఆ చిత్రం ప్రమోషన్ సమయానికి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలిపాడు. అయితే, సుశాంత్ తర్వాత చిత్రం 'సోన్ చిరియా' ఫ్లాప్ అయిన వెంటనే సుశాంత్ తో సారా విడిపోయిందని చెప్పాడు. ఆ విషయం తెలిసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపాడు. బాలీవుడ్ మాఫియా కారణంగానే ఆ చిత్రం ఫ్లాప్ అయిందని చెప్పాడు.