ప్రభాస్ 'ఆదిపురుష్' గురించి మరికొన్ని వివరాలు ఇవిగో!
- ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా
- ఐదు భాషల్లో ఆదిపురుష్
- 3డీ ఫార్మాట్ లో చిత్రీకరణ
ఇది ప్రధానంగా 3డీ ఫార్మాట్ లో తెరకెక్కనుంది. ఆదిపురుష్ ను 5 భారతీయ భాషల్లో రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనే కాకుండా పలు విదేశీ భాషల్లోనూ ఆదిపురుష్ విడుదలవుతుంది. ప్రభాస్ ఈ చిత్రం ద్వారా బాహుబలి వంటి ధీరోదాత్తమైన పాత్రలో మరోసారి కనువిందు చేయనున్నారు.
ఓ పాప్యులర్ బాలీవుడ్ స్టార్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ 2021లో మొదలవుతుంది. టి సిరీస్, రెట్రో ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా 'ఆదిపురుష్'ను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైందవంలో రాముడ్ని ఆదిపురుషుడిగా భావించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.