Corona Virus: తెలంగాణలో మరో 1,682 మందికి కరోనా పాజిటివ్

Spike of 1682 COVID19 cases in the last 24 hours
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,682 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,070  మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఆసుపత్రుల్లో 21,024 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 711 కి  చేరింది. జీహెచ్‌ఎంసీలో 235 మందికి కొత్తగా కరోనా సోకింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News