తెలంగాణలో కరోనా అప్ డేట్స్!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా అప్ డేట్స్!

894 new coronavirus cases in telangana
  • కొత్తగా 894 మందికి కరోనా 
  • కేసుల సంఖ్య 92,255
  • ఆసుపత్రుల్లో 21,420  మందికి చికిత్స
  • 70,132కి మంది డిశ్చార్జ్  
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా  894 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,006 మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,255కు చేరింది. ఆసుపత్రుల్లో 21,420 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  70,132 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 703కి  చేరింది. జీహెచ్‌ఎంసీలో 147మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 85 కేసులు నమోదయ్యాయి.    
                                 
Corona Virus
COVID-19
Telangana

More Telugu News