Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,102 కరోనా పాజిటివ్ కేసులు

coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా  1,102 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 9  మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,930  మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు  చేరింది. ఆసుపత్రుల్లో 22, 542 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  68,126  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 693   కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 234  మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 81  కేసులు నమోదయ్యాయి.

Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News