ఇద్దరు అబ్బాయిలతో అక్కాచెల్లెళ్ల ప్రేమ.. ఇంట్లో తెలిసిపోయిందని బావిలో దూకి ఆత్మహత్య
- ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16
- వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం
- ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి మెసేజ్
- 'మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా'నని తెలిపిన యువకుడు
తాము అబ్బాయిలను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, ఓ బావి వద్దకు వెళ్లి అందులో దూకారు. మధ్యప్రదేశ్ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బావిలో వారు దూకిన విషయాన్ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. అమ్మాయి తండ్రికి మేసేజ్ పంపిన ప్రేమికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నామని చెప్పారు.