సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- షూటింగులో పాల్గొన్న సమంత
- బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ నటుడు
- షూటింగుకి రెడీ అవుతున్న నాగశౌర్య
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో మూడో చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూలు షూటింగు పూర్తయింది. ఇదిలావుంచితే, ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నట్టు తాజా సమాచారం.
* నాగశౌర్య కథానాయకుడుగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి విదితమే. నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.