సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Hansika wears swim suit in her next movie
  • తాజా చిత్రంలో హన్సిక కొత్త అవతారం 
  • డిటెక్టివ్ పాత్ర పోషించనున్న రవితేజ 
  • 'లాభం' కోసం విజయ్ సేతుపతి డబ్బింగ్  
*  కథానాయిక హన్సిక తన తాజా చిత్రంలో స్విమ్ సూట్ ధరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న తన ఏభయ్యవ చిత్రమైన 'మహా'లో హన్సిక ఇలా బికినీ సూట్ లో గ్లామర్ ఒలికించనుందని అంటున్నారు. ఇందుకోసం ఈ లాక్ డౌన్ సమయంలో బాగా వర్కౌట్స్ చేసి, మంచి ఫిట్ నెస్ సాధించిందట.  
*  ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఆ చిత్రంలో డిటెక్టివ్ తరహా పాత్రను రవితేజ పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 'చంటబ్బాయ్' సినిమాలో చిరంజీవి పోషించినటువంటి పాత్ర తరహాలో ఇది సాగుతుందట.
*  విజయ్ సేతుపతి హీరోగా జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాభం' చిత్రం షూటింగ్ మరికొంచం బ్యాలెన్స్ గా వుంది. ఈ లోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో నిన్నటి నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి డబ్బింగ్ చెబుతున్నాడు. శ్రుతి హాసన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.  
Go Back to Shorts
Hansika
Raviteja
Shruti Hassan
Vijay Setupati

More Telugu News