KGF: 'కేజీఎఫ్-2' నుంచి సంజయ్‌ దత్‌ లుక్‌ విడుదల.. మామూలుగా లేదు!

  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్'
  • యశ్‌ హీరోగా సినిమా
  • విలన్‌గా‌ అధీరా పాత్రలో సంజయ్ దత్
  • సంజయ్  పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ విడుదల
Presenting SanjayDutts character from KGFChapter2

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. యశ్‌ హీరోగా నటించిన ఈ సినిమా కన్నడలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' రూపొందుతోంది.

ఈ సినిమాలో విలన్‌గా‌ అధీరా పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను ఈ చిత్ర బృందం ఈ రోజు‌ విడుదల చేసింది.

ఈ రోజు సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‌ విడుదల చేస్తున్నట్లు  ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపాడు. తనకు ఇంత కన్నా గొప్ప పుట్టినరోజు కానుక మరొకటి ఉండదని సంజయ్‌ దత్‌ కూడా పేర్కొన్నాడు. ఈ సినిమాలో నటిస్తుండడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.

సంజయ్ దత్‌ ముఖం మీద టాటూలు, సరికొత్త హెయిర్‌ స్టైల్‌, అతడి చేతిలో మారణాయుధం వున్నాయి. ఆయన లుక్‌ మామూలుగా లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.

More Telugu News