బాలకృష్ణ చిత్రంలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్!

Sneha to play kea role in Balakrishna movie
  • వివాహానంతరం ముఖ్య పాత్రలు చేస్తున్న స్నేహ 
  • బాలకృష్ణ భార్య పాత్రకు ఎంచుకున్న బోయపాటి 
  • యువ కథానాయికగా నూతన నటి పరిచయం
ఇంతకుముందు కథానాయికగా నటించి, చక్కని నటిగా పేరుతెచ్చుకున్న స్నేహ.. వివాహానంతరం అప్పుడప్పుడు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగులో ఆమె మరో చిత్రాన్ని చేయనుంది. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించనున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇక ఇందులో బాలకృష్ణ పోషించే ఒక పాత్రకు జోడీగా స్నేహను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ఇందులో బాలయ్య భార్యగా ఆమె కనిపిస్తుందట.

ఇక ప్రధాన హీరోయిన్ గా నూతన నటిని పరిచయం చేయనున్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క, ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాక ఈ చిత్రం షూటింగును తిరిగి నిర్వహిస్తారు.
Sneha
Balakrishna
Boyapati Sreenu

More Telugu News