రూ. 35 కోట్లు ఇస్తానన్నారంటూ ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ లీగల్ నోటీసులు
- బీజేపీలో చేరితే రూ. 35 కోట్లు ఇస్తానన్నారు
- నేనా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా: మలింగ
- అవి తప్పుడు, నిరాధార ఆరోపణలు: సచిన్
సోమవారం ఎమ్మెల్యే మలింగ విలేకరులతో మాట్లాడుతూ.. తాను సచిన్ పైలట్‌తో మాట్లాడానని, ఈ సందర్భంగా ‘నువ్వెంత ఆశిస్తున్నావ్?’ అని అడిగారని అన్నారు. ఆ వెంటనే రూ. 35 కోట్లు అంటూ ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయితే, ఆయన ఆఫర్‌ను తాను తిరస్కరించానని, విషయాన్ని సీఎం గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఎమ్మెల్యే ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి.