kangana ranaut: అలియాభ‌ట్ కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ అవార్డు తీసుకుంది: హీరోయిన్ కంగనా ఆగ్రహం

  • సినీ అవార్డుల వేడుకల్లోనూ కొందరు నటులకు అవమానం 
  • 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' చిత్రానికి దీపికకు అవార్డు
  • క్వీన్ సినిమాలో నా న‌ట‌న బాగుందని అంగీకరించిన దీపిక 
  • గ‌ల్లీబాయ్‌లో 10 నిమిషాలు క‌నిపించిన అలియాభ‌ట్ మాత్రం తీసుకుంది
kangana fire on alia bhatt

సినీ పరిశ్రమలో బంధుప్రీతిపై హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. సినీ అవార్డుల వేడుకల్లోనూ కొందరు నటులకు అవమానం జరుగుతుందని ఆమె తెలిపింది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గతంలో 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' చిత్రానికి హీరోయిన్ దీపిక ప‌దుకుణెకు అవార్డు వ‌చ్చిందని ఆమె చెప్పింది. అయితే, ఆమె త‌న‌క‌న్నా క్వీన్ సినిమాలో న‌ట‌న బాగుందన్న విష‌యాన్ని అంగీక‌రించిందని, ఆ అవార్డును తిర‌స్క‌రించిందని వివరించింది.

మరోవైపు, గ‌ల్లీబాయ్‌ సినిమాలో కేవలం 10 నిమిషాలు క‌నిపించిన అలియాభ‌ట్ మాత్రం తనకు అవార్డు వస్తే కొంచెం కూడా సిగ్గు లేకుండా దాన్ని తీసుకుందని విమర్శించింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ నటించిన చిచోర్ చిత్రానికి కనీసం ప్ర‌శంస‌లు కూడా ద‌క్క‌లేదని కంగనా రనౌత్ తెలిపింది.

సుశాంత్ సినీ పరిశ్రమలో పైకి రాకుండా బాలీవుడ్ మాఫియా ప్రయత్నించిందని చెప్పింది. డ్రైవ్ సినిమా ఆయన సినీ కెరీర్‌ను నాశ‌నం చేసిందని ఆమె చెప్పింది. ఆయన నటించిన ఆ సినిమాను థియేట‌ర్‌లో విడుద‌ల చేసే సత్తా క‌ర‌ణ్ జొహార్‌కు లేదంటే తాను న‌మ్మబోనని తెలిపింది. మ‌హేశ్ భ‌ట్‌తో పాటు క‌ర‌ణ్ జొహార్‌పై కేసు పెట్టినా త‌ప్పు లేదని ఆమె మండిపడింది.

More Telugu News