Payal Rajputh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • కమల్ సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ 
  • తెలుగులో మరో మలయాళ సినిమా రీమేక్
  • మరో రికార్డు కొట్టిన 'బుట్టబొమ్మ' పాట  
Payal Rajpuths item song in Bharateeyudu sequel

*  కమలహాసన్, శంకర్ ల కాంబినేషన్లో 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రంలో అందాలభామ పాయల్ రాజ్ పుత్ ఓ ఐటెం సాంగు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  గత మార్చి నెలలో విడుదలైన మలయాళం సినిమా 'కప్పేల'కి అన్ని వర్గాల నుంచి మంచి చిత్రంగా ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. మొహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
*  సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అలాగే ఇందులో పాటలన్నీ కూడా సూపర్ హిట్టయ్యాయి. ఇక 'బుట్టబొమ్మ..' పాట అయితే చెప్పేక్కర్లేదు. తాజాగా ఈ పాట 250 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

More Telugu News