ఏమాత్రం తగ్గని ట్రంప్... కరోనా 'చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి' అంటూ వ్యాఖ్యలు
- ఇప్పటికే చైనా వైరస్ అంటూ వ్యాఖ్యలు
- చైనా పునరావృతం చేసిందంటూ విమర్శలు
- ఇలా జరగడానికి చైనానే కారణమన్న ట్రంప్
గతంలో వచ్చిన ప్లేగు వ్యాధి ధాటికి ప్రజలు విలవిల్లాడారని, ఇలాంటిది అసలు మళ్లీ జరగకూడదని భావిస్తే చైనా దాన్ని పునరావృతం చేసిందని ఆరోపించారు. "ఓ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామో లేదో వైరస్ వ్యాప్తి మొదలైంది. ఆ సంతకం సిరా ఆరకముందే మహమ్మారి బయటపడింది, ఇలా జరగడానికి చైనానే కారణం" అంటూ ట్రంప్ ఘాటుగా విమర్శించారు. వైట్ హౌస్ లో జరిగిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేస్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.