మనవాళ్లకూ ఓ మణిరత్నం ఉన్నాడనుకుంటే... మీరేమో అంతా నా ఇష్టం అంటూ ఏమేమో చేస్తున్నారు: రామజోగయ్యశాస్త్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనవాళ్లకూ ఓ మణిరత్నం ఉన్నాడనుకుంటే... మీరేమో అంతా నా ఇష్టం అంటూ ఏమేమో చేస్తున్నారు: రామజోగయ్యశాస్త్రి

Ramajogaiah Shastri comments on RGV
  • పవర్ స్టార్ బయోపిక్ ప్రకటించిన వర్మ
  • ట్విట్టర్ లో రామజోగయ్యశాస్త్రి స్పందన
  • నేను హర్ట్ అంటూ వ్యాఖ్యలు
పవర్ స్టార్ బయోపిక్ అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పుడే స్పందనలు మొదలయ్యాయి. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి ట్విట్టర్ లో తన అభిప్రాయాలు వెల్లడించారు.

"ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు మిమ్మల్ని చూసి తెలుగువాళ్లకు కూడా ఓ మణిరత్నం ఉన్నాడనుకున్నాం... మీరేమో అంతా నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు... పోండి సార్, మీతో కటీఫ్... నా వ్యాఖ్యలకు మీరేమీ బదులివ్వక్కర్లేదు... తెలివిగా ఏదో ఒకటి చెప్పేస్తారు.. నేను హర్టయ్యాను" అంటూ ట్వీట్ చేశారు.
Ramajogaiah Sastry
RGV
Powerstar
Biopic

More Telugu News