RGV: 'మర్డర్' సినిమా నుంచి మరో ఆసక్తికర పోస్టర్ విడుదల చేసిన ఆర్జీవీ

rgv new movie poster
షార్ట్స్‌లో చూడండి
'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల చేసిన వర్మ ఈ రోజు ఈ సినిమాలోని మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపేలా వర్మ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.

ఈ పోస్టర్‌లో అమృత  తన కుమారుడిని ఎత్తుకుని ఉన్నట్లు ఉంది. ప్రణయ్ పరువు హత్యకు గురికావడం, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నివేశాలతో యాథార్థగాథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ పుట్టాడు.
Go Back to Shorts
RGV
Tollywood

More Telugu News