Varla Ramaiah: ఆ చిన్నారి ప్రాణం కాపాడిన మహేశ్ బాబుకు అభినందనలు: వర్ల రామయ్య

varla ramaiah fires on mahesh babu help
షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు మహేశ్ బాబుపై టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశంసల జల్లు కురిపించారు. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ భార్య నాగజ్యోతి కొన్ని రోజుల క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, ఆ చిన్నారికి అరుదైన గుండె జబ్బు ఉండడంతో ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు ఆమెకు విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్ చేయించారు. దీనిపై వర్ల రామయ్య స్పందించారు.

'ఒక పేద బాలిక గుండె ఆపరేషన్ కు ఆర్థిక సాయం చేసి ఆ చిన్నారి ప్రాణం కాపాడిన తెలుగు సినిమా హీరో శ్రీ మహేశ్ బాబుకు నా మనఃపూర్వక అభినందనలు. ఈ సాయం మీకు చిన్నది కావచ్చు. కానీ, ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు తీరని మనోవేదనను తప్పించింది. మీకు, మీ కుటుంబానికి దేవుడు తోడుంటారు' అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
Mahesh Babu

More Telugu News