Amrutha: వర్మపై అమృత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: బాలస్వామి వివరణ

Amrutha dint made any comments on Ram Gopa Varma says Balaswamy
షార్ట్స్‌లో చూడండి
ఎప్పుడూ వివాదాలతో సహజీవనం చేసే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... 'మర్డర్' సినిమా ప్రకటనతో మరో వివాదానికి తెరతీశారు. పరువు హత్య కథనంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రం అమృత, ప్రణయ్, మారుతీరావుల కథేనని  ప్రచారం జరుగుతోంది. దీంతో, వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. పోస్టర్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆమె అన్నట్టు కథనాలు వచ్చాయి. అమృత వ్యాఖ్యలకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని... నిజమైన స్టోరీ అని చెప్పలేదని అన్నారు.

మరోవైపు ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. అమృత పేరిట సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వర్మ సినిమాపై అమృత స్పందించలేదని అన్నారు. ఆమె పేరుపై వస్తున్న స్టేట్మెంట్లను నమ్మొద్దని కోరారు.

మరోవైపు, ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నట్టి క్రాంతి, నట్టి రుణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
Go Back to Shorts
Amrutha
Ram Gopal Varma
Murder Movie
Tollywood

More Telugu News