Andhra Pradesh: ఏపీలో పది పరీక్షల రద్దు?.. కాసేపట్లో కీలక ప్రకటన

ap to be announced decision on 10th exams
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై కాసేపట్లో కీలక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. పరీక్షలను రద్దు చేయాలనే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ విషయంపై ఇప్పటికే  ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ చర్చించారు. ఈ రోజు సాయత్రం ఆయన ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేయనున్నారు. ఏపీలో పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు. పరీక్షలు లేకుండానే  విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


Go Back to Shorts
Andhra Pradesh
exams

More Telugu News