Radheshyam: ప్రభాస్ 20వ చిత్రం టైటిల్ ఇదేనట!

Prabhas 20th Movie Tittle Radheshyam
షార్ట్స్‌లో చూడండి
'సాహో' తరువాత ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా దాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ, ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం, తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయిన ప్రభాస్ అభిమానులు 'రాధేశ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Radheshyam
Prabhas
Pooja Hegde

More Telugu News