Andhra Pradesh: కాపుల సంక్షేమానికి రూ.2,846 కోట్లు... ఏపీ బడ్జెట్ పార్ట్ 2

  • సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన వైసీపీ ప్రభుత్వం
  • ప్రాథమిక ఉన్నత విద్యకు - రూ. 22,604.01 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి - రూ.15,735 కోట్లు
2846 cr allocated to Kapu welfare in AP Budget


రూ. 2,24,789.18 కోట్లతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్లో సంక్షేమ పథకాలకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాలకు భారీ కేటాయింపులు  చేసింది. ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్ ఇవే

  • న్యాయశాఖకు - రూ. 913.76 కోట్లు
  • విద్యుత్‌ రంగానికి - రూ. 6,984.72 కోట్లు
  • ఆర్థిక రంగానికి - రూ. 50,703 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి - రూ.2,055.63 కోట్లు
  • ప్రణాళిక రంగానికి - రూ.515.87 కోట్లు
  • పర్యావరణం, అటవీశాఖకు - రూ.457.32 కోట్లు
  • సోషల్‌ వెల్ఫేర్‌ కు - రూ.12,465.85 కోట్లు
  • ప్రాథమిక ఉన్నత విద్యకు - రూ. 22,604.01 కోట్లు
  • సాధారణ పరిపాలనకు - రూ.878.01 కోట్లు
  • కాపుల సంక్షేమానికి - రూ.2,846.47 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు - రూ.425.93 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి - రూ.15,735 కోట్లు
  • గిరిజనుల సంక్షేమానికి - రూ.5,177.54 కోట్లు
  • మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు - రూ. 8150.24 కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు - రూ. 856.64 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు - రూ. 3,520.85 కోట్లు
  • రవాణా, ఆర్‌అండ్‌బీ కోసం - రూ.6,588.58 కోట్లు
  • మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం - రూ.3456.02 కోట్లు
  • జగనన్న అమ్మఒడి పథకానికి - రూ.6వేల కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా పథకానికి - రూ.6,300 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి - రూ.275.52 కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత పథకానికి - రూ.3వేల కోట్లు
  • జగనన్న చేదోడు పథకానికి - రూ.247 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు - రూ.46.46 కోట్లు
  • వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి - రూ.1500 కోట్లు
  • డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి - రూ.1365.08 కోట్లు
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు - రూ.16వేల కోట్లు
  • వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి - రూ.200 కోట్లు
  • జగనన్న తోడు పథకానికి - రూ.930 కోట్లు
  • రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం - రూ.54.51 కోట్లు
  • వ్యవసాయ ల్యాబ్‌లకు - రూ.65 కోట్లు

More Telugu News