Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ రికార్డు 
  • మోక్షజ్ఞ సినిమా గురించి చెప్పిన బాలయ్య
  • ఆగిపోయిన సినిమాని మొదలెడుతున్న ధనుశ్  
Shruti Hassan sets record on social media

*  శ్రుతి హాసన్ కి సినిమాలు తగ్గినా అభిమానులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్ స్టాగ్రాంలో ఇప్పటికి  ఆమెకు 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.
*  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ దీనిపై మాట్లాడుతూ, మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథ ఇప్పటికే సిద్ధంగా ఉందనీ, సరైన సమయంలో ఆ సినిమా సెట్స్ కి వెళుతుందనీ చెప్పారు. అయితే, ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.
*  రెండేళ్ల క్రితం ధనుశ్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే, తొలి షెడ్యూలు షూటింగ్ అయ్యాక ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రాన్ని కంటిన్యూ చేయడానికి ధనుశ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News