నాన్నగారు అందరి ముందు తిట్టేశారు: బాలకృష్ణ

Balakrishna remembers olden days
  • రేపు బాలయ్య పుట్టినరోజు
  • వీరబ్రహ్మేంద్రస్వామి షూటింగ్ సంగతి వెల్లడించిన బాలయ్య
  • టేకుల మీద టేకులు తీసుకున్నానని వివరణ
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నటుడిగానూ, రాజకీయ నాయకుడిగానూ కొనసాగడం కష్టమైన విషయమేని, మొదట్లో భయం ఉండేదని, క్రమశిక్షణతో ఆ సమస్యను అధిగమించానని చెప్పారు.

తండ్రి ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు. ఆయన తన విషయంలో ఓసారి సహనం కోల్పోయారని, 'వీరబ్రహ్మేంద్రస్వామి..' చిత్రం షూటింగులో టేకుల మీద టేకులు తీసుకుంటుంటే ఎంతో కోప్పడి అందరి ముందూ తిట్టేశారని వెల్లడించారు. అప్పటి నుంచి  ఏ పనైనా ఎంతో శ్రద్ధగా చేయడం అలవర్చుకున్నానని బాలకృష్ణ వివరించారు. 1984లో వచ్చిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్ర చిత్రంలో బాలకృష్ణ సిద్ధయ్య పాత్ర పోషించారు.
Go Back to Shorts
Balakrishna
NTR
Veerabrahmendraswami
Takes
Shooting
Birthday

More Telugu News