ముహూర్తం చూసుకునే ఇంట్లోంచి బయల్దేరతా... ఇలాంటివి పట్టించుకోను!: బాలకృష్ణ
- షూటింగుకు ఎప్పుడైనా రెడీ అన్న బాలయ్య
- వందలమందితో షూటింగుకైనా సిద్ధమేనని వెల్లడి
- 2022 వరకు కరోనా పోదని వ్యాఖ్యలు
అయితే, షూటింగ్ లు ప్రారంభమైతే ఒకట్రెండు రోజులు భౌతికదూరం పాటిస్తారని, ఆ తర్వాత అందరూ మర్చిపోతారని, ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయం అని బాలయ్య అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ఆఫీసుల్లో ఎవరి క్యూబ్ లో వారు కూర్చుని పనిచేసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ అలాకాదని వివరించారు. మూడ్నాలుగు నెలలు షూటింగులు జరగకపోవచ్చని వెల్లడించారు. అంతేకాదు, కరోనా మహమ్మారి పోవాలంటే 2022 వరకు వేచి చూడకతప్పదని అన్నారు.