Suma: 'రాములో రాములా' పాటకు ఇంట్లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టిన యాంకర్‌ సుమ.. వీడియో ఇదిగో

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సుమ
  • అభిమానులను ఆకట్టుకుంటున్న డ్యాన్స్
  • తనదైన శైలిలో సుమ డ్యాన్స్
suma dance

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ హీరో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాముల’ పాటకు యాంకర్‌ సుమ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న సుమ ఆసక్తికర వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది.

ఇంట్లో ఆమె తన పెంపుడు శునకం ముందు ఇలా డ్యాన్స్‌ చేసి మరో వీడియోతో అభిమానుల ముందుకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల్లోనూ ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.  ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాముల’ పాటకు బన్నీ వేసిన స్టెప్పులకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
           

More Telugu News