Viral Pics: బాలయ్య 'కామన్ డీపీ' మామూలుగా ట్రెండ్ అవట్లేదు!

  • బాలకృష్ణ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో డీపీ
  • జూన్‌ 10న ఆయన పుట్టినరోజు
  • రెండు సినిమాల్లోని లుక్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన డీపీ
  • షేర్ చేస్తోన్న సినీ, రాజకీయ ప్రముఖులు
balaiah common dp

ఈ నెల‌ 10న సినీనటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో రూపొందించిన ఓ కామన్ డీపీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ డీపీని షేర్‌ చేశారు. బాలకృష్ణ నటించిన రెండు సినిమాల్లోని లుక్‌లతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయ పాత్రకూడా ఉంది.

'సినీజీవితంలో ప్రేక్ష‌కుల‌ అభిమాన క‌థానాయ‌కుడిగా అల‌రిస్తూ.. శాసనసభ్యునిగా ప్రజాసేవలో.. కేన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా సామాజిక సేవలో... విశేష సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీని విడుదల చేయడం సంతోషదాయకం' అని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా ఈ డీపీని షేర్ చేశారు.

'అటు యాక్షన్ సినిమా అయినా ఇటు పౌరాణిక చిత్రం అయినా వేసిన పాత్రకి వన్నె తెచ్చే నటన. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలోనూ రియల్ హీరోగా గుర్తింపు పొందిన మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కామన్ డీపీ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది' అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

'నటరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కామన్ డీపీని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది' అంటూ పత్తిపాటి పుల్లారావు దీన్ని షేర్ చేశారు.  #NBKBirthdayCDP, #JaiBallaya హ్యాష్ ట్యాగ్‌లతో దీన్ని అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇదే డీపీని బ్యానర్లుగా కట్టి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఈ సినిమా కోసం స్వయంగా ఓ పాట పాడారని టాక్. ఆయన నటిస్తోన్న106వ సినిమా ఇది.

More Telugu News