Pinipe Viswarup: ఎస్సీల సంక్షేమంపై చర్చకు వస్తా... వర్ల రామయ్యకు స్పష్టం చేసిన విశ్వరూప్

Pinipe Viswaroop accepts Varla challenge
షార్ట్స్‌లో చూడండి
ఎస్సీల సంక్షేమంపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. ఎస్సీల సంక్షేమంపై చర్చకు తాను సిద్ధమేనని, వర్ల రామయ్య సవాల్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. తమది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఎస్సీల కోసం మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీల సంక్షేమంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న 'చంద్రబాబు అండ్ కో'తో తాను చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pinipe Viswarup
Varla Ramaiah
SC
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News