Allu Arjun: బన్నీ సినిమా రీమేక్ లో రణ్ వీర్?

  • భారీ హిట్ కొట్టిన 'అల వైకుంఠపురములో'
  • భారీ రేటుకి హిందీ రీమేక్ హక్కులు
  • ప్రచారంలో పలువురు హీరోల పేర్లు
  • రణ్ వీర్ తో నిర్మాత సంప్రదింపులు  
Ranveer Singh in Ala Vaikunthapuramulo remake

మొన్నటి సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో.. ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సంగీతం పరంగా కూడా చిత్రంలోని ప్రతి పాటా ఆకట్టుకుని, మ్యూజికల్ గా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్ధే ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం సాధించిన విజయాన్ని తెలుసుకున్న బాలీవుడ్ హీరోలు పలువురు ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, చిత్ర నిర్మాత అశ్విన్ మాత్రం రణ్ వీర్ సింగ్ తో ఈ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయంలో ఆయన రణ్ వీర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

More Telugu News