Doctor Sudhakar: నా కుమారుడికి బొబ్బలు అందుకే వస్తున్నాయి.. డాక్టర్ సుధాకర్ తల్లి సంచలన ఆరోపణ

doctor sudhakar mother  accuses slow poison giving to my son
  • డాక్టర్ సుధాకర్‌కు స్లో పాయిజన్ ఇస్తున్నారు
  • అయ్యన్న పాత్రుడిని కలిశామనే మాపై టీడీపీ ముద్ర
  • సుధాకర్‌ను కొట్టి పరువు తీసిన పోలీసులు, వైద్యులపై చర్య తీసుకోవాలి
విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌కు అందుతున్న వైద్యంపై ఆయన తల్లి కావేరీబాయి సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆమె తన కుమారుడికి ఆయాసం, పెదవులపై బొబ్బలు రావడానికి కారణం బహుశా స్లో పాయిజన్ అయి ఉంటుందని ఆరోపించారు.

స్లోపాయిజన్ ఇస్తుండడం వల్లే సుధాకర్ కాళ్లకు పొంగులు, పెదవులపై బొబ్బలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమస్యా లేకున్నా సుధాకర్‌ను మానసిక ఆసుపత్రిలో చేర్చారని అన్నారు. తాము ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటామని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

తమకు ఏ పార్టీతో సంబంధాలు లేకపోయినా కేవలం అయ్యన్న పాత్రుడిని కలిశామన్న కారణంతో తమపై టీడీపీ ముద్ర వేశారని వాపోయారు. తన కుమారుడిని కొట్టి పరువు తీసిన పోలీసులు, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కావేరీబాయి డిమాండ్ చేశారు.
Doctor Sudhakar
Kaveribai
Visakhapatnam District
Slow poison

More Telugu News