కేసీఆర్ లో... K, C, R‌ అంటే ఏమిటో కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్

KTR gives new definition for KCR
  • K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు 
  • కొండపోచమ్మసాగర్ ను ప్రారంభించిన కేసీఆర్
  • ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఏమిటో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. KCRలో K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని అర్థమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈరోజు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంప్ చేయడానికి కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజక్టును నిర్మించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 2.85 లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందని చెప్పారు. త్వరలోనే ప్రారంభం అయ్యే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.
Go Back to Shorts
KCR
KTR
Kondapochamma Sagar

More Telugu News