Sivaji: సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేసిన శివాజీ

  • కరోనాతో ఆగిపోయిన షూటింగులు
  • ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు
  • రూ. 2 లక్షల సాయం చేసిన శివాజీ
Actor Shivaji financial help to film workers

కరోనా కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ తదితర పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో, సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ హీరో, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ శివాజీ ముందుకొచ్చారు. తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన శివాజీని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభినందించింది.

More Telugu News