Balakrishna: బి.గోపాల్ సినిమాలో కొత్త తరహా పాత్రలో బాలకృష్ణ

  • హిట్ కాంబినేషన్ గా పేరు 
  • స్క్రిప్టుకి తుది మెరుగులు
  • బోయపాటి సినిమా తర్వాత ఇదే
Balakrishna plays father for a young girl

ఒకప్పుడు బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ అంటే అదో క్రేజ్!
బాలకృష్ణను యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించేలా చూపించడంలో బి.గోపాల్ శైలి ప్రత్యేకమైనది. అందుకే, ఈ కలయికలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు విజయాలనే సాధించాయి.

ఇక ఇన్నాళ్ల తర్వాత వీరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజక్టుకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం స్క్రిప్టు పని జోరుగా సాగుతోంది. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ స్క్రిప్టుకి మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని సమాచారం.

విశేషం ఏమిటంటే, ఇందులో బాలకృష్ణ ఓ యువతికి తండ్రిగా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తారని, ఇది కచ్చితంగా ఆయనకు విభిన్నమైన పాత్ర అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగుకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఆ చిత్రం పూర్తికాగానే బి.గోపాల్ చిత్రం సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News