హిమాలయాల్లోను షూటింగు చేయనున్న బోయపాటి?

Boyapati Movie
  • బాలయ్యతో బోయపాటి మూడో సినిమా
  • కవల సోదరులుగా కనిపించనున్న బాలకృష్ణ
  • రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు  
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. 'సింహా' .. 'లెజెండ్' వంటి సంచలన విజయాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కవల సోదరులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర రాయలసీమ నేపథ్యంలో .. మరో పాత్ర వారణాసి నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు.

వారణాసిలో అఘోరాగా కనిపించే పాత్ర తాలూకు సన్నివేశాలు కొన్ని హిమాలయాల్లోను చిత్రీకరించనున్నారట. అందువలన పరిస్థితులు కుదురుకున్నాక అక్కడ ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకి చెందిన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇతర దేశాల్లో చిత్రీకరించవలసివుంది.  ఇప్పట్లో అంతటి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బోయపాటి, హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేయించనున్నాడట. లాక్ డౌన్ పూర్తికాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా బోయపాటి ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.
Balakrishna
Boyapati Sreenu
Tollywood

More Telugu News