20 రూపాయల కోసం చిన్నారిని బావిలోకి తోసి చంపేసిన యువతి

girl murdered 4 year old baby for Rs 20
  • కర్ణాటకలోకి బెళగావి జిల్లాలో ఘటన
  • చిన్నారి చేతిలోని రూ. 20 లాక్కున్న నిందితురాలు
  • ఏడవడంతో బావిలోకి తోసి హత్య
20 రూపాయల కోసం నాలుగేళ్ల చిన్నారిని బావిలోకి తోసి చంపేసిందో యువతి. కర్ణాటకలోని బెళగావి జిల్లా జగనూర గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నారి దివ్య రూ.20 పట్టుకుని బిస్కెట్లు కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. దారిలో పూజ అనే యువతి చిన్నారి చేతిలో ఉన్న రూ. 20 చూసి లాక్కుంది.

దీంతో పాప ఏడుపు లంకించుకుంది. ఆమె ఏడిస్తే విషయం బయటకు వచ్చి దొరికిపోతానన్న భయంతో చిన్నారిని లాక్కెళ్లి పక్కనే ఉన్న బావిలోకి తోసేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు వచ్చే లోపే దివ్య ప్రాణాలు కోల్పోయింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు పూజను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Karnataka
Murder
Rs 20
girl
Crime News

More Telugu News