Vaishnav Tej: యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న 'ఉప్పెన' పాట

  • వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం 'ఉప్పెన'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన విడుదల
  • యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్ ను దాటేసిన 'నీ కళ్లు నీలి సముద్రం'
Uppena song records in Youtube

మెగా కాంపౌండ్ నుంచి కొత్తగా వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సాయితేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. కరోనా కారణంగా సినిమా రిలీజ్ ఆగిపోయింది.  

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.

సినిమా విడుదల ఆగిపోయినా... ఈ చిత్రంలోని పాటలు మాత్రం ప్రేక్షకాదరణ పొందాయి. 'నీ కళ్లు నీలి సముద్రం' అనే పాట యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్ ను దాటేసింది. 'ధక్ ధక్' అనే పాట 1.2 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

More Telugu News