వెల్డింగ్ చేస్తుండగా పేలిన సిలిండర్లు.. కుప్పంలో ఇద్దరు యువకుల మృతి

Cylinder blast in Kuppam Two dead
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • వెల్డింగ్ నిప్పు రవ్వలు సిలిండర్లపై పడడంతో పేలిన వైనం
  • మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులు బెంగళూరుకు తరలింపు
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో రెండు కంప్రెషర్ సిలిండర్లు పేలిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని తంబిగానిపల్లెలో ఓ వెల్డింగ్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. షాపు యజమాని గౌష్ బాషా, తన వద్ద పనిచేసే ఇద్దరు యువకులు అఫ్సర్ (19), ఎజాద్ (17), మంజునాథ్‌లతో కలిసి క్రేన్‌లో ఉండే రెండు కంప్రెషర్ సిలిండర్లపై వెల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగసి, సిలిండర్లపై పడడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో అవి పేలిపోయాయి.

ఈ ఘటనలో అఫ్సర్, ఎజాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గౌష్ బాషా, మంజునాథ్‌తోపాటు క్రేన్ డ్రైవర్ రఫీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తొలుత కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.
Go Back to Shorts
Chittoor District
Kuppam
Cylinder blast

More Telugu News