Cheetah: చిరుత వేట.. ఇంటి పైకప్పు నుంచి ఇంట్లో పడ్డ జింక!

  • ముంబైలోని పోవాలి ప్రాంతంలో సంఘటన
  • మచ్చల జింకను వేటాడిన చిరుత
  • తప్పించుకునే క్రమంలో ఇంటి పైకప్పు పైకి
  • రేకులు కూలడంతో ఇంట్లో పడ్డ జింక
Cheetah attacks on Raindeer

అందరూ నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి ఓ జింక ఇంట్లోకి పడిపోయింది. దీంతో, పెద్ద శబ్దం రావడంతో ఆ ఇంట్లోని  కుటుంబసభ్యులు ఉలిక్కిపడి లేచిన సంఘటన మహారాష్ట్ర, ముంబైలోని పోవాలి ప్రాంతంలో జరిగింది. ఓ మచ్చల జింకను చిరుత వేటాడుతుండటంతో దాని నుంచి తప్పించుకునేందుకు యత్నించింది.

ఈ క్రమంలో ఒక ఇంటి పైకప్పుకు దూకిన క్రమంలో ఆ ఇంటి పెంకులు పగిలిపోవడంతో ఇంట్లోకి పడిపోయింది.  ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖాధికారులకు ఆ కుటుంబసభ్యులు తెలిపారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఆ జింకను పట్టుకుని తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలివేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్ గా మారాయి.

More Telugu News