విలన్ గా కొత్త లుక్ తో కనిపించనున్న శ్రీకాంత్

Boyapati Movie
  • బాలయ్యతో బోయపాటి మూవీ
  • ప్రతినాయకుడిగా శ్రీకాంత్
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
తెలుగు తెరపై నిన్నటితరం కథానాయకుడిగా శ్రీకాంత్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కెరియర్ ఆరంభంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించిన శ్రీకాంత్, ఎవరూ ఊహించని విధంగా హీరోగా అతి తక్కువ కాలంలో 100 సినిమాలను పూర్తి చేశాడు. అలాంటి శ్రీకాంత్ మళ్లీ విలన్ పాత్రలవైపు మొగ్గుచూపుతున్నాడు. జగపతిబాబులో విలన్ ను తెరకి పరిచయం చేసిన బోయపాటి, శ్రీకాంత్ లోని విలన్ ను కొత్తకోణంలో పరిచయం చేస్తున్నాడు.

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి రూపొందిస్తున్న సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నెరసిన గెడ్డం .. మీసాలతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలీష్ గా ఈ సినిమాలో శ్రీకాంత్ కనిపించనున్నాడని అంటున్నారు. బోయపాటి చాలా కొత్తగా శ్రీకాంత్ పాత్రను డిజైన్ చేశాడనీ, ఈ పాత్ర మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి విలన్ పాత్రలతో శ్రీకాంత్ బిజీ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా కొత్త కథానాయిక పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu
Srikanth

More Telugu News