Nara Lokesh: జగన్ మానసిక పరిస్థితికి నా సానుభూతి: నారా లోకేశ్

Nara Lokesh criticises CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆ పార్టీ నేతలపై పోలీస్ కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా, నారా లోకేశ్ స్పందిస్తూ, పేద వాడికి ముద్ద అన్నం పెట్టినందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టే దుస్థితికి జగన్ చేరారని ఎద్దేవా చేశారు. ఈ దుస్థితికి చేరిన జగన్ మానసిక పరిస్థితికి తన సానుభూతి తెలియజేస్తున్నానంటూ లోకేశ్ ఓ ట్వీట్ లో విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News