బాలయ్య ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటారు: బోయపాటి

Boyapati Movie
  • బాలయ్యను ఒప్పించడం తేలిక
  • ఆయన కథల విషయంలో జాగ్రత్తగా వుంటాను
  •  బాలయ్య వెంటనే గ్రహిస్తారన్న బోయపాటి
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుని, లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగు మొదలుపెట్టాలనే ఉద్దేశంతో బోయపాటి వున్నాడు. బాలకృష్ణతో బోయపాటికి ఇది మూడో సినిమా. అందువలన ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది.

తాజాగా బాలకృష్ణ గురించి బోయపాటి మాట్లాడుతూ .. "కథా కథనాలు .. పాటలు .. ఫైట్లు .. ఇలా ఏ విషయాన్నైనా నేను ముందుగా నా సినిమా సాంకేతిక నిపుణులతో మాట్లాడతాను. ఆ తరువాతే నేను అనుకున్న విషయాన్ని బాలకృష్ణగారికి వివరిస్తాను. బాలకృష్ణ గారు వెంటనే ఒప్పేసుకుంటారు .. ఆయనను ఒప్పించడం చాలా తేలిక. అయితే విషయాన్ని చెబుతున్నప్పుడే అది తన బాడీ లాంగ్వేజ్ కి ఎంతవరకూ సరిపోతుంది అనే విషయాన్ని ఆయన గ్రహించేస్తారు. విషయాన్ని చెప్పడం పూర్తయ్యేలోగా ఒక నిర్ణయానికి వచ్చేసి చెప్పేస్తారు. కనుక ఆయన సినిమాలకి సంబంధించిన ప్రతి విషయంలోను జాగ్రత్తగా వుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu
Tollywood

More Telugu News