గేల్ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ నరేశ్ శర్వాన్
- శర్వాన్ ను పాముతో పోల్చిన గేల్
- తల్లావాస్ జట్టు నుంచి ఉద్వాసనకు శర్వానే కారణమంటూ ఆరోపణలు
- గేల్ తనకు సన్నిహితుడున్న శర్వాన్
- ఆరోపణలు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడి
"కెరీర్ మొదట్నించి గేల్ తో కలిసి ఆడాను. అతడిలో అసాధారణ ప్రతిభ ఉంది. అతడ్ని జట్టు నుంచి తొలగించాలని నేనెందుకు కోరుకుంటాను?" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అటు, జమైకా తల్లావాస్ జట్టు యాజమాన్యం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. గేల్ ను జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసేశామని, అంతే తప్ప అందులో శర్వాన్ ప్రమేయం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది.